రెమ్యునరేషన్ భారీగా పెంచిన బన్నీ..?

229
Allu Arjun
- Advertisement -

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో భారీ విజయం అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. పుష్ప ఫస్ట్ లుక్‌లో అల్లు అర్జున్ రఫ్ ‌లుక్‌తో కనిపిస్తున్నాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ సినిమాకు బన్నీ రెమ్యునరేషన్ ను భారీగా పెంచాడని తెలుస్తోంది. రూ. 35 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటాను కూడా బన్నీ తీసుకోబోతున్నాడని చెపుతున్నారు. ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి బన్నీ రూ. 25 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు పాతిక శాతం వాటా ను తీసుకున్నాడనే టాక్ ఉంది. అయితే ‘పుష్ఫ’ సినిమాపై కరోనా ఎఫెక్ట్ ఉండటంతో బడ్జెట్ పై నిర్మాతలు కొంత ఆలోచిస్తున్నట్టు సమాచారం. మరి ఈలాంటి పరిస్థితిలో బన్నీ రెమ్యునరేషన్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

- Advertisement -