- Advertisement -
తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారీన పడగా తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు బన్నీ. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంటూ కరోనా నివారణకు సంబంధించిన చికిత్స పొందుతున్నాను. గత కొద్ది రోజులుగా నాతో కాంటాక్ట్ అయిన వారు పరీక్షలు చేయించుకోండి. ఇంట్లోనే సురక్షితంగా ఉంటూ, వీలున్నప్పుడు వ్యాక్సిన్ చేయించుకోవాలన్నారు. తన ఆరోగ్యం బాగానే ఉందని… శ్రేయోభిలాషులు, సన్నిహితులు, అభిమానులు ఎవరు ఆందోళన చెందొద్దన్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
- Advertisement -