Allu Arjun:పుష్ప 2 సెట్స్‌.. వీడియో వైరల్

38
- Advertisement -

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొనగా ఈ సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్‌కి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు లభించింది. దేవిశ్రీప్రసాద్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డుని అందుకున్నారు.

Also Read:బొల్లి మచ్చలకు నివారణ ఉందా?

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ షేర్ చేశాడు. ఉదయం 9 గంటలకు సంథింగ్ స్పెషల్ అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఆ సంథింగ్ స్పెషల్ ఏంటని ఆశగా ఎదురు చూస్తుండగా బన్నీ ఆ స్పెషల్ పోస్ట్ ని షేర్ చేశాడు. మార్నింగ్ తన డే స్టార్ట్ అయిన దగ్గర నుంచి పుష్ప 2 సెట్స్ లో షూటింగ్, ఆ లొకేషన్స్.. ఆ వీడియోలో బన్నీ చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -