చివ‌రి క్ష‌ణాల్లో అల్లు అర్జున్‌ కాపాడాడు

196
Allu Arjun saves Sukumar's life during Arya movie shooting
- Advertisement -

సుకుమార్ రైటింగ్స్ పతాకంపై బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి సుకుమార్ నిర్మిస్తున్న చిత్రం దర్శకుడు. అశోక్, ఇషా జంటగా నటిస్తున్నారు. హరిప్రసాద్ జక్కా దర్శకుడు. ఆగస్ట్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. నిన్న సాయంత్రం ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక‌ని గ్రాండ్ గా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యాడు. ఫంక్ష‌న్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతుండ‌గా, సుకుమార్ ఆర్య షూటింగ్ స‌మ‌యంలో జ‌రిగిన సంఘ‌ట‌న చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు.

ఆర్య సినిమా షూటింగ్ సమయంలో ప్ర‌మాద‌వ‌శాత్తు తాను బోట్ లోంచి నదిలో పడిపోయానని చెప్పాడు సుకుమార్. నాకు ఈత రాక‌పోగా , నేను ప‌డిపోవ‌డం చూసి అంతా షాక్ కు గురై అందరూ అలాగే చూస్తుండిపోయారని అన్నాడు. ఇక చివ‌రి క్ష‌ణాలు అవే అనుకుంటున్న స‌మ‌యంలో అల్లు అర్జున్ నదిలో దూకి త‌న‌ని ర‌క్షించాడ‌ని అన్నాడు. అందుకే ఆయ‌నే నా రియ‌ల్ హీరో అని సుకుమార్ ఉద్వేగ భ‌రితంగా చెప్పాడు.

దర్శకుడు మాట్లాడుతూ ‘‘పెళ్లికి ముందు సుకుమార్‌కి ఓ ప్రేమకథ ఉండేది. ఆ అమ్మాయికి సినిమాల గురించి అంతగా తెలీదు. డైరెక్టర్‌ అంటే ఏం చేస్తాడని సుకుమార్‌ని అడిగితే తను భయపడి ఆమెని లవర్‌గా ఉంచితే ఇంకెన్ని అనుమానాలు వస్తాయోనని తాళికట్టి భార్యను చేసేసుకున్నాడు. ఆ ఒక్క సీన్‌ని సుకుమార్‌ జీవితం నుంచి తీసుకున్నాం ఈ సినిమాలో పెట్టాం. అంతకుమించి ఏ దర్శకుడి జీవితాన్ని కాపీ కొట్టలేదు’’ అని అన్నారు. ‘‘జక్కా హరిప్రసాద్‌ ఆలోచన నుంచి వచ్చిన కథ ఇది. నాకు తోడుగా దిల్‌ రాజుగారు కూడా కలిసి సినిమాను విడుదల చేయడం ఆనందంగా ఉంది’’ అని సుకుమార్‌ తెలిపారు.

- Advertisement -