సంజయ్‌లీలా భన్సాలీతో పుష్పరాజ్‌..పాన్ ఇండియా మూవీ!

141
allu arjun
- Advertisement -

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తొలిపార్టు బాక్సీఫీస్‌ను షేక్ చేసింది. దాదాపు రూ. 100 కోట్లకు పైగా ఈ సినిమా వసూలు చేయగా సెకండ్ పార్టు కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత బన్నీ ఎవరితో చేయనున్నారోనన్న ఆసక్తి అందరిలో నెలకొనగా సోమవారం అల్లు అర్జున్ ముంబై లో బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీని మీట్ అవడం హాట్ టాపిక్ గా మారింది.

దేవదాస్,బాజీరావు మస్తానీ, పద్మావత్ లాంటి చారిత్రక చిత్రాలతో సంజయ్ లీలా భన్సాలీ క్రేజ్ పెరుగగా తాజాగా బన్నీతో ఒకవేళ సినిమా తీస్తే అది ఏ విధంగా ఉంటుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

- Advertisement -