స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివికమ్ర్ శ్రీనివాస్ కాంబినేషన్ లో అల..వైకుంఠపురంలో అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను అల్లు అరవింద్, కె.రాధాకృష్ణలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈమూవీ ఫస్ట్ లుక్ అందరిని అకట్టుకుంటుంది.
ఇక బన్నీ తన ఫ్యాన్స్ కు తాజాగా మరో గిప్ట్ ఇచ్చాడు. ఈసినిమా నుంచి సామజవరగమన అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈపాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమన్ ఈ పాటకు మ్యూజిక్ అందించారు. సిధ్ శ్రీరామ్ ఈ పాటను పాడారు. ఈపాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. విడుదలైన 24గంటల్లోనే 5మిలియన్ల వ్యూస్ ను రాబట్టింది. సరివెన్నెల సితారామ శాస్త్రీ రాసిన ఈపాటకు మంచి రెస్పెస్స్ వస్తుంది. ఈమూవీని 2020సంక్రాంతికి విడుదల చేయనున్నారు. చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న మూవీ కావడంతో ఈసినిమాపై భారీగా ఆశలు ఉన్నాయి.
https://youtu.be/Thf60JU8E98