పుష్ప 2..బన్నీ అదిరే రికార్డు!

7
- Advertisement -

శ్రీలీల డ్యాన్సుల్లో తనదైన స్టయిల్‌, తనకంటూ ఓ పత్యేక మార్క్‌ క్రియేట్‌ చేసుకుని, నటనలో జాతీయ స్థాయిలో ఉత్తమ నటనతో పాటు డ్యాన్సింగ్‌లో కూడా వన్‌ ఆఫ్‌ ద ఫైనెస్ట్‌ ఇండియన్‌ డ్యాన్సర్‌గా ఉన్న ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌తో.. డ్యాన్సింగ్‌ క్వీన్‌ శ్రీలీల జతకడుతోంది.. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇండియన్‌ ఫిల్మ్‌ పుష్ప-2 ది రూల్‌ చిత్రంలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, కథానాయిక శ్రీలీలపై ఓ స్పెషల్‌ మాసివ్‌ కిస్సిక్‌ సాంగ్‌ తెరకెక్కింది. డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై అంచానాలు తారాస్థాయిలో వున్నాయి.

ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు. అమెరికాలో అయితే పుష్ప 2 కోసం రిలీజ్ కు చాలా రోజుల ముందు బుకింగ్స్ ఓపెన్ చేశారు. బుకింగ్స్‌లో బన్నీ ఏ హీరోకు సాధ్యంకాని ఫీట్‌ని సాధించారు. ఏకంగా అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వసూలు చేసింది. రిలీజ్ కి 15 రోజుల ముందే పుష్ప 2 సినిమా అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేయడం సరికొత్త రికార్డ్.

ఇప్పటివరకు రిలీజ్ కి ఇన్ని రోజుల ముందే ఇంత కలెక్టు చేయడం ఏ హీరోకు లేదు. సినిమా రిలీజయ్యాక అమెరికాలో ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతారో చూడాలి.

Also Read:‘దేవకి నందన వాసుదేవ’..నా అదృష్టం: మానస వారణాసి

- Advertisement -