విజయ్….గొప్ప నటుడు:అల్లు అర్జున్

544
geetha govindam audio
- Advertisement -

విజయ్ దేవరకొండ,రష్మిక జంటగా నటించిన చిత్రం గీత గోవిందం.అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 15న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా ఇప్పటికే చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉంది సినిమా యూనిట్. తాజాగా ఆదివారం హైదరాబాద్‌లో ఆడియో రిలీజ్ వేడుకను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన అర్జున్…విజయ్ దేవరకొండపై ప్రశంసలు గుప్పించారు. తెలుగులో మంచి నటులు ఉన్నారు కానీ గొప్ప నటులు కొంతమందే ఉన్నారని విజయ్‌ దేవరకొండ ఓ గొప్ప నటుడు అన్నారు. అర్జున్‌రెడ్డి చూశాక వారం రోజులు నేనెవరినీ కలవలేదని…
అందులో విజయ్‌ నటన అంతగా వెంటాడిందన్నారు.

Image result for geetha govindam audio

ఈ సినిమాలో కథానాయికకి కాస్త ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని…. కానీ విజయ్‌ దేవరకొండ బాగా చేశాడు. ఇద్దరికీ మంచి పేరొస్తుంది అన్నారు. నా కెరీర్‌ పరంగా మా నాన్న సహాయం నాకెంత ఉందో, అంతకంటే ఎక్కువ సహాయం బన్నీ వాస్‌ది ఉంటుంది. తన కోసమే ఈ వేడుకకి వచ్చా. నేనీ సినిమాని చూశాను. బాగుంది. గోపీసుందర్‌ సంగీతం అంటే చాలా ఇష్టమన్నారు. నిజంగా నేను మారిపోయాను. నా మార్పు అందరూ చూడాలంటే ఆగస్టు 15న థియేటర్లకి రావాలన్నారు విజయ్ దేవరకొండ.

- Advertisement -