వరుణ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గని’. ఏప్రిల్ 8న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన బన్నీ….వరుణ్‌పై ప్రశంసలు గుప్పించారు. చిన్నప్పటి నుంచి వరుణ్ అంటే చాలా ఇష్టం. ఎంతో క్యూట్ గా ఉండేవాడు. ఇప్పుడు కాదు… వరుణ్ పుట్టినప్పటి నుంచే అందగాడు. ఇప్పుడు వరుణ్ అంటే ఎంతో గౌరవం ఏర్పడింది. ఎందుకంటే, తనకంటూ ప్రత్యేక శైలి ఏర్పరచుకున్నాడు. కథల ఎంపికలో విభిన్నంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు. ట్రెండ్ ను ఫాలో కాకుండా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం తపిస్తుంటాడని ప్రశంసలు గుప్పించాడు.
గని చిత్రంతో తన సోదరుడు అల్లు బాబీ నిర్మాతగా సక్సెస్ అందుకోవాలని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. తన జీవితంలో సోదరుడు అల్లు బాబీ పాత్ర ఎంతో ఉందని, తండ్రి తర్వాత అంతటివాడైన అన్నయ్య నిర్మాతగా మారడాన్ని తాను ఎంతో మద్దతుగా భావిస్తున్నట్టు వివరించాడు. తమన్ సంగీతం బాగుంది…. దర్శకుడు కిరణ్ కు తొలి చిత్రమే అయినా ఎంతో అనుభవం ఉన్నవాడిలా తీశాడని తెలిపారు బన్నీ.