- Advertisement -
గణేష్ నిమర్జనం కార్యక్రమంలో కూతురు అర్హతో కలిసి సందడి చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. వినాయ చవితి సందర్భంగా ఆగస్ట్ 31న జూబ్లిహిల్స్‌లోని గీతా ఆర్ట్స్ భవనంలో నెలకొల్పిన గణషునికి నేడు విడ్కోలు పలికారు. ఈ నిమర్జనం కార్యక్రమంలో బన్నీ తన కూతురు ఆర్హతో కలిసి పాల్గొన్నాడు.
ఇక ఈ వేడుకలో గణపతికి వీడ్కోలు చెబుతూ బన్నీ కొబ్బరి కాయ కొట్టగా.. అర్హ గణపతి బప్పా మోరియా అంటూ సందడి చేసింది. కూతురిని ఎత్తుకుని మురిసిపోతూ బన్నీ డాన్స్ చేసిన ఈ వీడియో నెట్టంట వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో, ఫొటోలు అల్లు ఫ్యాన్స్‌ని తెగ ఆకట్టుకుంటున్నాయి. కాగా బన్నీ ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు.
- Advertisement -