నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తర్వాత అల్లు అర్జున్ ఇప్పటివరకు తన నెక్ట్స్ సినిమా ఏంటో ప్రకటించలేదు. దీంతో బన్నీ తర్వాత చేయబోయే సినిమా ఏంటనేదానిపై సస్పెన్స్ నెలకొంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ అందించారు బన్నీ. నూతన సంవత్సం కానుకగా తాను చేయబోయే సినిమాను ప్రకటించనున్నారట బన్నీ.
కొంతకాలంగా బన్నీ 96 అనే చిత్రంలో నటిస్తున్నారన్న వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి-త్రిష కాంబినేషన్‌లో తమిళంలో భారీ హిట్ సాధించిన చిత్రం చిత్రం 96. 1996లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం తమిళ ప్రేక్షకుల మన్ననలు పొందింది. మద్రాస్ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రాన్ని
నందగోపాల్ నిర్మించారు.
తెలుగు రీమేక్ రైట్స్‌ని నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ఈ సినిమాను అల్లు అర్జున్‌తో తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారట దిల్ రాజు. నాపేరు సూర్య నాఇల్లు ఇండియా తర్వాత ఏ సినిమాకు కమిట్ కానీ బన్నీ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని ప్రచారం జరుగుతోంది. బన్నీ సైతం 96 తమిళ సినిమా చూసిన దగ్గర నుంచి ఈ సినిమా చేస్తే బాగుంటుందనే ఫీలింగ్‌కు వచ్చారట. సో నూతన సంవత్సర కానుకగా బన్నీ ప్రకటించే గుడ్ న్యూస్ ఇదేనా లేదా మరేదైనా సర్‌ప్రైజ్ ఉందా అన్న ఆసక్తితో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.