ఆర్మీలో అల్లు అర్జున్..

227
- Advertisement -

స్టైలీస్‌ స్టార్‌ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం మూవీతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ హీరో ఇప్పుడు ‘నా పేరు సూర్య .. నా ఇల్లు ఇండియా’ అనే మూవీతో బిజీ బిజీగా ఉన్నాడు.ఈ సినిమా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ‘ఊటీ’లో జరుగుతోంది. హైదరాబాద్ లో రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా, గత నెల 24వ తేదీన ‘ఊటీ’లో మొదలైంది. కొన్ని ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కీలకమైన సీన్స్‌ని షూట్‌ చేస్తున్నారు.

Allu Arjun Naa Peru Surya Movie Ooty Schedule

మరి ఈ సినిమా ఈ నెల 10వ తేదీతో ఈ షెడ్యూల్ పూర్తి కానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మిలటరీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. పాత్రకి తగినట్టుగా కనిపించడం కోసం ఆయన ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. దేశభక్తికి సంబంధించిన ఈ సినిమాలో కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

- Advertisement -