మహానుభావుడు డైరెక్టర్‌తో చైతు..

221
- Advertisement -

డైరెక్టర్‌ మారుతి చిన్న సినిమాలు చేస్తూ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. రీసెంట్‌గా‘మహానుభావుడు’ సినిమాతో మరో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు ఈ యువ దర్శకుడు. మారుతి త్వరలో నాగ చైతన్య హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు. ‘బాబు బంగారం, ప్రేమమ్’ వంటి సినిమాలను నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

Maruthi with Naga Chaitanya

ఈ సినిమా గురించి మీడియాతో కొన్ని విషయాలు పంచుకున్నాడు మారుతి. అక్కినేని హీరోలంటే ప్రేమకథలకు పెట్టింది పేరని.. చైతూ కూడా ఇప్పటిదాకా మంచి ప్రేమకథలు చేశాడని.. తాను చైతూతో చేసేది కూడా ప్యూర్ లవ్ స్టోరీ అని మారుతి వెల్లడించాడు. ఈ చిత్రంలో కథానాయికగా అను ఇమ్మాన్యుయెల్ నటిస్తుందని కూడా మారుతి తెలిపాడు.

ఇక తాను స్క్రిప్టు రాసే శైలి గురించి మారుతి చెబుతూ.. తాను హీరోల్ని దృష్టిలో ఉంచుకుని కథలు రాస్తానని అన్నాడు. హీరో ఫిక్సయ్యాకే తాను కథ రాస్తానని.. హీరో ఇమేజ్.. బాడీ లాంగ్వేజ్.. స్టైల్ దృష్టిలో ఉంచుకుని పాత్రను తీర్చిదిద్దుతానని అతను చెప్పాడు. మున్ముందు టాలీవుడ్ పెద్ద హీరోలందరితోనూ కలిసి పని చేయాలని.. పెద్ద సినిమాలు చేయాలని ఆశిస్తున్నానని మారుతి చెప్పాడు.

- Advertisement -