త‌దుప‌రి సినిమా గురించి తొంద‌ర్లోనే క్లారీటి ఇస్తాః బ‌న్నీ

371
allu arjun
- Advertisement -

నాపేరు సూర్య నాఇల్లు ఇండియా సినిమా త‌ర్వాత మ‌రే సినిమాకు ఒప్పుకొలేదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. సినిమా అనుకున్నంత స్ధాయిలో విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో తీవ్ర నిరాశ‌లో ఉన్నాడు. అందుకే త‌న త‌ర్వాతి సినిమాపై ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈసందర్భంగా బ‌న్నీ చాలా క‌థ‌లు విన్నా త‌న‌కు న‌చ్చ‌క‌పోవ‌డంతో ఏ స్క్రీప్ట్ ను ఒకే చేయ‌లేదు. ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ తో బ‌న్నీ సినిమా చేయ‌నున్నాడ‌ని గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి.

bunny-trivikram

ఆ త‌ర్వాత త్రివిక్ర‌మ్ తో సినిమా చేయ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. గ‌తంలో బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన చిత్రాలు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి విజ‌యాన్ని అందుకున్న విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో మూడో సినిమా రానుంద‌ని ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్నారు. త‌న త‌ర్వాతి సినిమా గురించి ట్వీట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు బ‌న్నీ. ముందుగా అభిమానులంద‌రికి దీపావ‌ళి శుభాకాంక్షాలు తెలియ‌జేశాడు. త‌న త‌దుప‌రి సినిమాకి సంబంధించిన ఎనౌన్స్‌మెంట్ కోసం ఇన్నాళ్ళు వేచి చూసిన అభిమానుల‌కి ధ‌న్య‌వాదాలు తెలిపాడు.

- Advertisement -