స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా బన్నీ మరోసారి వార్తల్లోకెక్కాడు. ఇద్దరు టాలీవుడ్ హీరోయిన్లకు బన్నీ పార్టీ ఇచ్చాడని సోషల్ మీడియాలో కోడైకూస్తోంది. ఇంతకి అల్లు అర్జున్ ఆ హీరోయిన్లకు పార్టీ ఎందుకు ఇచ్చాడు.. ఆ హీరోయిన్లు ఏవరూ అని టాలీవుడ్ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది.
అసలు విషయం ఏంటంటే ఇటివలే బన్నీ కొత్త క్యారీ వ్యాన్ ను కొనుకున్నాడు. దాని ఖరీదు రూ.7కోట్లు. దానికి ఫాల్కన్ అని పేరు కూడా పెట్టాడు. సకల సౌకర్యాలతో ఈబస్సును రూపొందించుకున్నాడు. కొత్తగా కోనుగోలు చేసిన క్యారీ వ్యాన్ పార్టీని ఆ ఇద్దరు హీరోయిన్ లతో ముంబైలో సెలబ్రెట్ చేసుకున్నాడట బన్నీ.
హైదరాబాద్ లో అయితే అందరూ చూస్తారని ముంబైలో ఇచ్చాడట. ఇంతకి ఆ హీరోయిన్లు ఎవరా అనుకుంటున్నారా..అల్లు అర్జున్ సరసన దేశముదురు సినిమాలో చేసిన హన్సిక, బద్రీనాథ్ సినిమాలో హీరోయిన్ గా నటించిన తమన్నాలకు బన్నీ పార్టీ ఇచ్చాడంట. ఈవిషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.