‘రాజుగాడు’ మరోసారి వాయిదా..

234
Raj Tarun's 'Raju Gadu' release date announced
- Advertisement -

యంగ్ హీరో రాజ్ తరుణ్‌ ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన వరుస సినిమాలతో బిజీగా మారాడు. ప్రస్తుత సంజనా రెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాజుగాడు’. ఈ సినిమాలో అమైరా దస్తర్ హీరోయిన్‌గా నటిస్తుంది.

Raj Tarun's 'Raju Gadu' release date announced

ఇప్పటికే విడుదలై ఈ చిత్ర టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. కాగా ఈ చిత్రంలో రాజ్ తరుణ్‌ క్లెప్టోమేనియాతో ఇబ్బంది పడే కుర్రాడిగా నటిస్తున్నాడు. తన ప్రమేయం లేకుండానే దొంగతనం చేసే వింత పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక విషయానికొస్తే. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది.

గతంలో విడుదల తేదీని ప్రకటించినప్పటికి అనివార్య కారణాల వల్ల వాయిదా వస్తుండగా జూన్‌ 1న రాజుగాడు సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్టుగాచిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించారు. ఏకె ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపిసుందర్‌ ఈ చిత్రానికి సంగీతమందిస్తుండుగా రాజేంద్ర ప్రసాద్‌, 30 ఇయర్స్‌ పృథ్వీ, సితారలు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే అనుకున్న తేదీనా విడుదలవుతుందో లేదో చూడాలి మరి..!

- Advertisement -