Allu Arjun:మేడమ్ టుస్సాడ్స్ లో అల్లు అర్జున్..

33
- Advertisement -

‘పుష్ప’ చిత్రంలోని నటనకు గానూ ఇటీవలే నేషనల్ అవార్డును పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు మరో అరుదైన ఘనతను సాధించారు. ‘మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్‌’లో మైనపు విగ్రహం ఉన్న మొదటి తెలుగు నటుడిగా ఐకాన్ స్టార్ రికార్డ్ క్రియేట్ చేయబోతున్నారు. తాజాగా ‘మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్‌’ వారు అల్లు అర్జున్ కొలతలు తీసుకుంటున్న వీడియో ఒకటి వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ వీడియోలో అల్లు అర్జున్ నల్లటి సూట్ ధరించి కనిపిస్తున్నారు.

ఈ సంవత్సర ప్రారంభంలో దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రముఖుల మరియు కళాకారుల మధ్య ఒక సిట్టింగ్ జరిగింది. ఇందులో ఒక్కొక్కరి నుంచి 200కి పైగా కొలతలను వారు సేకరించారు. అద్భుతమైన మైనపు విగ్రహాలను రూపొందించడానికి డిటైల్డ్‌గా కొలతలు తీసుకునే ప్రక్రియ ఎప్పటి నుంచో ఉంది. ఈ కొలతలతో వారు రూపొందించే విగ్రహాల పక్కన ఒరిజనల్ వ్యక్తులు నిలబడినా.. ఎవరు నార్మల్ పర్సనో కనిపెట్టడం కష్టమయ్యేంత అద్భుతంగా మైనపు విగ్రహాన్ని రూపొందిస్తారు.

అల్లు అర్జున్ నేడు ప్రపంచానికి తెలిసిన నటుడు. తన విలక్షణమైన నటనతో గ్లోబల్ రేంజ్ గుర్తింపును సొంతం చేసుకున్నారు. నేషనల్ అవార్డు పొందిన తొలి తెలుగు హీరోగా చరిత్ర సృష్టించడమే కాకుండా.. ప్రాంతీయ సరిహద్దులను అధిగమించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే వారినే కాకుండా.. ఇతర భాషల వారిని సైతం తన అసాధారణమైన నటనా పటిమతో ఫ్యాన్స్ అయ్యేలా చేసుకున్నారు. ముందు ముందు ఐకానిక్ పెర్ఫార్మెన్స్‌లతో భారతీయ సినిమాని శాసించడానికి సిద్ధంగా ఉన్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఐకాన్ స్టార్.. మున్ముందు సినీ రంగంలో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’ పార్ట్ 2 అయిన ‘పుష్ప ది రూల్’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 15 ఆగస్ట్, 2024న భారీస్థాయిలో విడుదల కానుంది.

Also Read:World Cup 2023 :కివీస్ భోణి.. కప్పు ఆ జట్టుదేనా?

- Advertisement -