సినీ ఇండస్ట్రీలో ఒకరి సినిమాను మరొకరు చేయడం మామూలే. ఇండస్ట్రీ తొలినాళ్ళ నుంచి కూడా ఈ విధంగా జరుగుతూనే ఉంది. డైరెక్టర్ ఒకరిని దృష్టిలో పెట్టుకొని కథ రాసుకొని తీరా ఆ కథ అనుకున్న హీరోకు నచ్చకపోవడంతో వేరే దారి లేక ఇతర హీరోలతో తీసి సంచలన విజయాలను నమోదు చేస్తుంటారు. ఈ మద్య కాలంలో కూడా ఈ విధంగా తెరకెక్కించిన సినిమాలు కొన్ని హిట్స్ అయితే మరికొన్ని ఫ్లాప్స్ గా మిగిలిపోయాయి. పుష్ప మూవీని మొదట మహేష్ బాబుతో తెరకెక్కించాలని సుకుమార్ భావించాడు. కానీ కథ మహేష్ కు నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్ట్ బన్నీ చేతుల్లోకి వెళ్లింది. ఆ తరువాత ఆ మూవీ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. .
అలాగే బన్నీ చేసిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీ మొదట ఎన్టీఆర్ చేయాల్సింది. డైరెక్టర్ వక్కంతం వంశీ మొదట ఎన్టీఆర్ కు ఈ మూవీ స్టోరీ చెప్పగా తారక్ ను నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్ట్ బన్నీ చేశాడు. కానీ ఆ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. ఇక విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ స్టార్ చేసిన ” అర్జున్ రెడ్డి ” మూవీ కూడా మొదట శర్వానంద్ చేయాల్సి ఉండగా.. డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోవడంతో ఈ క్రేజీ మూవీ రౌడీ హీరో ఖాతాలోకి వెళ్లింది. ఇక ప్రస్తుతం రాంచరణ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రాబోతున్న ” RC16″ మూవీ కథ కూడా మొదట ఎన్టీఆర్ కు వినించాడు బుచ్చిబాబు. తారక్ డేట్స్ కోసం దాదాపు రెండేళ్ళు ఎదురు చూశాడు కూడా. కానీ వరుస కమిట్మెంట్స్ ఉండడంతో తారకే స్వయంగా రాంచరణ్ కు సూచించాడు.
ఇక రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో కూడా మూవీ తెరకెక్కాల్సివుంది. కానీ ఫుల్ స్టోరీ చరణ్ కూడా నచ్చక పోవడంతో ఆ ప్రాజెక్ట్ కు బ్రేక్ పడింది. ఐతే అదే స్టోరీని విజయ్ దేరవకొండకు చెప్పి ఒప్పించాడు గౌతమ్ తిన్ననూరి. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కనుంది. గతంలో సూపర్ స్టార్ కృష్ణ చేయాల్సిన ఖైదీ మూవీ చిరంజీవి చేయడం, కోలీవుడ్ స్టార్ హీరో చేయాల్సిన బిజినెస్ మెన్ మూవీ మహేష్ చేయడం.. ఇలా ఒకరి సినిమాలు మరొకరు చేయడం తరచూ జరుగుతూనే ఉంటుంది. అయితే ఇలా ఒకరి సినిమాలు మరొకరి చేసి హిట్ కొట్టిన మూవీసే అధికంగా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఆయా సినిమాలు ఎలాంటి విజయాలను నమోదు చేస్తాయో చూడాలి.
Also Read:IND vs ENG : భారీ ఆధిక్యంలో భారత్ !