సల్మాన్‌కు షాకిచ్చిన డీజే !

232
Allu Arjun film collects more money than Salman Khan’s Tubelight
- Advertisement -

రేసుగుర్రం, సరైనోడుతో పాటు వరుసగా మాస్ కథాంశాలతో సినిమాలు చేస్తూ విజయాల్ని దక్కించుకుంటున్నాడు అల్లు అర్జున్. ఆ పంథాలోనే ఆయన చేసిన మరో మాస్ ఎంటర్‌టైనర్ చిత్రం డీజే దువ్వాడ జగన్నాథం. ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించాడు అల్లు అర్జున్. తాజాగా డీజే సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్‌లైట్ సినిమాను బీట్ చేసింది. జూన్‌ 23 ప్రపంచ వ్యాప్తంగా ఈ రెండు సినిమాలు విడుదలయ్యాయి. బాక్సాఫీసు వద్ద బాలీవుడ్‌ సినిమా ‘ట్యూబ్‌లైట్‌’ను తెలుగు సినిమా ‘డీజే’ అధిగమించింది. దేశవ్యాప్తంగానే కాకుండా అమెరికాలో కూడా ‘డీజే’ సల్మాన్‌ సినిమా వసూళ్లను దాటింది.
allu arjun

బాహుబలి రికార్డులు బద్దలు కొట్టడమే లక్ష్యంగా విడుదలైన ట్యూబ్‌లైట్‌ దేశవ్యాప్తంగా దాదాపు 4350 స్క్రీన్లపై విడుదలైంది. తొలిరోజు నుంచే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. అల్లు అర్జున్‌ డీజే ను సాధారణంగానే 1000 నుంచి 1200 స్క్రీన్లపై ప్రదర్శించారు. ‘ట్యూబ్‌లైట్‌’తో పోలిస్తే ‘డీజే’ చాలా తక్కువ స్క్రీన్లపై విడుదలైనప్పటికీ బాక్సాఫీసు వద్ద ముందంజలో నిలవడం గమనార్హం. దేశవ్యాప్తంగా ‘డీజే’ రూ. 24 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ‘ట్యూబ్‌లైట్‌’ రూ. 21.15 కోట్లు రాబట్టింది. సల్మాన్‌ సినిమాను ‘డీజే’ బీట్‌ చేసిందని సినీ విశ్లేషకుడు రమేశ్‌ బాలా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. అయితే ‘ట్యూబ్‌లైట్’పై విమర్శకుల నుంచి తీవ్ర నిరాశ ఎదురవడంతో బాక్సాఫీసు వద్ద వెనకబడింది.

salman-tubelight-radio-song

ప్రతీకారంతో ముడిపడి ఉన్న మాస్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. సాధారణ కథకు బ్రాహ్మణ నేపథ్యాన్ని జోడించి దర్శకుడు హరీష్‌శంకర్ ఈ సినిమాను రూపొందించారు. పూజా హెగ్డే కథానాయిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. కబీర్‌ ఖాన్‌ ‘ట్యూబ్‌లైట్‌’కు దర్శకత్వం వహించారు. సోహైల్‌ ఖాన్‌, ఝు ఝు, మాటిన్‌ రే, ఓంపురి తదితరులు చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.

- Advertisement -