టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ – ముత్తంశెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి ఓ ఆసక్తికరమైన అప్ డేట్ వినిపిస్తోంది.
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీకి అల్లు అర్జున్ నాలుగు భాషల్లో డబ్బింగ్ చెప్పనున్నాడని సమాచారం. తమిళం, మలయాళం భాషలలో బన్నీ మాట్లాడగలుగుతాడు. అలాగే కన్నడ భాష కూడా తెలుగుకు దగ్గరగా ఉంటుంది. ఈ భాష కూడా బన్నీ బాగానే మాట్లాడగలడు. కాబట్టి తెలుగుతో పాటు ఈ మూడు భాషల్లో సొంతగా డబ్బింగ్ చెప్పడం కష్టం కాదు. ఎవరి పాత్రకు వారు డబ్బింగ్ చెప్తే ఆ ఫీల్ వేరే లెవల్. అందుకే అల్లు అర్జున్ ‘పుష్ప’ అన్ని భాషల వర్షన్లకు తానే డబ్బింగ్ చెప్తానంటూ స్వయంగా అనట్లు తెలుస్తోంది. అయితే, హిందీ భాష మీద అంతపట్టు లేకపోవడంతో ఒక్క హిందీ వెర్షన్‌కు మాత్రం వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పిస్తున్నారని టాక్.