బిగ్‌బాస్ 5: ఈవారం జెస్సీ ఎలిమినేట్!

49

బిగ్ బాస్ సీజన్‌ 5 బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంతగానో అల‌రిస్తు 10 వారంలో నడుస్తోంది. షో నుండి ఒక్కొక్కొరుగా బయటికి వచ్చేస్తున్నారు. గత వారం విశ్వ ఎలిమినేట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ షోలో ఈ వారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌ని అంద‌రూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎప్పటిలాగే ఈ వారం కూడా ఎలిమినేషన్‌కి ముందే ఎవరు ఇంటి నుండి వెళ్లిపోతున్నారో లీకైనట్లు తెలుస్తోంది.

అనారోగ్యం కారణంగా జశ్వంత్ పడాల హౌస్ నుంచి బయటకు వచ్చిన‌ట్టు సమాచారం. అయితే స్ట్రాట‌జీకి మారుపేరైన కాజ‌ల్ త‌క్కువ ఓట్ల‌తో పోలింగ్‌లో వెన‌క‌బ‌డ‌టంతో అంద‌రూ ఆమె వెళ్లిపోవ‌డం ఖాయ‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. కానీ జెస్సీని అనారోగ్యం వేధించ‌డంతో వారం మ‌ధ్య‌లోనే హౌస్ నుంచి నిష్క్ర‌మించాడు. కాకపోతే ఎలిమినేట్ మాత్రం అవ‌లేదు. అత‌డిని సీక్రెట్ రూమ్‌కి పంపించి తిరిగి హౌస్‌కు పంపిద్దామ‌నుకున్నారు బిగ్‌ బాస్‌.

అయితే అత‌డి ఆరోగ్యం మెరుగ‌వ‌క‌పోవ‌డంతో ఈ వారం జెస్సీని ఇంటికి పంపించివేస్తున్నార‌ట‌! ఇక జెస్సీ ఎలిమినేష‌న్‌తో కాజ‌ల్ ఎలిమినేష‌న్ గండం నుంచి బ‌య‌ట‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు స‌ర‌యు, ఉమాదేవి, ల‌హ‌రి, న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీదా, శ్వేత వ‌ర్మ‌, ప్రియ‌, లోబో, విశ్వ ఎలిమినేట్ అయ్యారు. దీంతో హౌస్ లో తొమ్మిది మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉండగా వీరిలో సింగర్ శ్రీరామచంద్రకు సెలబ్రిటీల సపోర్ట్ గట్టిగా ఉంది.