ఓటు వేసిన అల్లు అర్జున్…

416
allu arjun
- Advertisement -

దేశవ్యాప్తంగా తొలిదశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.ఆంధప్రదేశ్‌, తెలంగాణ సహా మొత్తం 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 91 లోక్‌సభ స్థానాలకు సంబంధించి పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం నుండే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు.

సినీ నటుడు అల్లు అర్జున్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.33లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీస్‌కు వచ్చి, క్యూలైన్లో నిలబడి ఓటు వేశారు. అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరారు.

తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలోని 17 ఎంపీ స్ధానాలతో పాటు ఏపీలోని ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌ జరగనుంది.నిజామాబాద్‌తోపాటు సమస్యాత్మక ప్రాంతాలు మినహా మిగిలిన సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. 2,97,08,600 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

ఏపీలో 3,93,45,717 మంది ఓటర్లు ఈసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. తొలిసారి ఓటు హక్కు పొందిన 18-19 ఏళ్ల ఓటర్లు 10,15,219 మంది ఉన్నారు. తొలిదశ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 1,279 మంది అభ్యర్థులు తలపడుతుండగా కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, కిరణ్‌ రిజిజు, వీకే సింగ్‌, మహేశ్‌ శర్మ, సత్యపాల్‌ సింగ్‌ తదితరులు బరిలో ఉన్నారు.

- Advertisement -