టాలీవుడ్లో సంక్రాంతి సినిమాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతికి హిట్ కొడితే ఏడాది అంతా విజయమే కలుగుతుందని హీరోలు భావిస్తారు. అందుకే టాప్ హీరోలు తమ సినిమాలను సంక్రాంతికి విడుదల చేసేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. విడదలయ్యే సినిమాల్లో హిట్ కొట్టేవి ఒకటో రెండో ఉంటే గత రెండు సంవత్సరాలుగా మెగా హీరోలకు సంక్రాంతి అంతగా కలిసిరాలేదు.
పవన్,రామ్ చరణ్ సంక్రాంతికి ముందుకువచ్చి ప్రేక్షకులను నిరాశపర్చారు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకువచ్చేందుకు సాహసం చేస్తున్నాడు బన్నీ. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురములోతో హిట్ ట్రాక్ కొడతాడా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
2018లో అత్యంత భారీ అంచనాలతో ‘అజ్ఞాతవాసి’,2019లో రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’తో ప్రేక్షకుల ముందుకువచ్చారు. కానీ ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోళ్తాకొట్టాయి. ఈ నేపథ్యంలో బన్నీ మెగా హీరోల సంక్రాంతి ఫెయిల్యూర్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తాడని అంతా భావిస్తున్నారు.