షాక్‌లో అల్లు అర్జున్‌..!

466
allu arjun arhan
- Advertisement -

డీజే..దువ్వాడ జగన్నాథం తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్నారు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. సినిమా షూటింగ్‌లో ఏమాత్రం గ్యాప్ దొరికినా ఫ్యామిలీతో ఎంజాయ్‌ చేసే బన్నీ ఇవాళ తన కుమారుడు అయాన్ పుట్టినరోజు సందర్భంగా చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.

బన్నీ, ఆయన సతీమణి స్నేహారెడ్డి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తమ ముద్దుల కొడుకు అయాన్‌కి శుభాకాంక్షలు తెలిపారు. అర్హాన్‌కి తాతయ్య అల్లు అరవింద్ ఇచ్చిన గిఫ్ట్ చూసి ఆశ్చర్యానికి గురయ్యానని తెలిపారు అర్జున్. మా నాన్న అయాన్‌కు పుట్టినరోజు కానుకగా స్విమ్మింగ్‌ పూల్‌ ఇచ్చారు. నేను ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నానని తెలిపారు.

45 రోజుల క్రితం ఏం కావాలని నాన్న అయాన్‌ను అడిగారు. పూల్‌ కావాలని అయాన్ చెప్పాడు. నాన్న సరే అని, కట్టించేశారు. అలాంటి తాతయ్య ఉండటం అయాన్ అదృష్టం. నాలుగో తరం పిల్లలు లక్కీ. వాళ్లని చూసి అసూయ వేస్తేందన్నారు. ఈ స్విమ్మింగ్‌ పూల్‌కి ‘అల్లు పూల్‌’ అని పేరు పెట్టాం అని పోస్ట్‌ చేస్తూ అయాన్‌ స్విమ్మింగ్ చేస్తున్న ఫోటోను షేర్ చేశారు. అయాన్‌కు ఫ్యాన్స్‌ విషెస్ చెప్పడంతో పాటు బన్నీ చేసిన పోస్టును షేర్ చేస్తున్నారు.

- Advertisement -