బన్నీ.. సౌత్ తొలి హీరో!

21
- Advertisement -

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ మరో ఘనత సాధించారు. ఇప్పటికే పుష్ప సినిమాలో నటనకు గాను ఉత్తమ జాతీయ నటుడి అవార్డు దక్కించుకున్న బన్నీ తాజాగా దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. మార్చి 28న ఈ కార్యక్రమం జరగనుంది.

అయితే మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రభాస్, మహేష్ బాబు మైనపు విగ్రహాలు ఉండగా అవి లండన్‌ మ్యూజియంలో ఉన్నాయి. తొలిసారి ఓ దక్షిణాది హీరో మైనపు విగ్రహం దుబాయ్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటి వరకు సౌత్‌ ఇండియాకు చెందిన నటుల విగ్రహాలకు చోటుదక్కలేదు.

దుబాయ్‌ మ్యూజియంలో బాలీవుడ్‌ స్టార్స్‌ అమితాబ్‌ బచ్చన్‌, షారుక్‌ ఖాన్‌, ఐశ్వర్య రాయ్‌, రణ్‌బీర్‌ కపూర్‌ విగ్రహాలు ఉండగా తాజాగా బన్నీ కూడా చేరిపోయారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే దుబాయ్ చేరుకున్నారు బన్నీ.

Also Read:Gold price:లేటెస్ట్ ధరలివే

- Advertisement -