ఇటీవలే `అల వైకుంఠపురములో` చిత్రంతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్. ఆ కిక్ ను పార్టీల పేరుతో ఫుల్‌గా ఎంజాయ్ చేశాడు. అటుపై ఫ్యామిలీతో విదేశాల్లో రిలాక్స్ అయి ఇటీవలే మళ్లీ హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యాడు. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంలో ఏఏ 20 షూటింగ్‌లో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడు బన్నీ. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో తన తదుపరి చిత్రం షూటింగ్ కోసం కేరళ అడవులకు వెళ్లడానికి బన్నీ సిద్ధమవుతున్నాడు.
సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఎర్ర చందనం రహస్య రవాణ నేపథ్యంలో రూపొందనుంది. ఇందులో బన్నీ ద్విపాత్రాభినయం చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒక కథానాయికగా రష్మికను ఎంపిక చేసుకున్నారు. ఈ కథ చిత్తూరు అడవి నేపథ్యంలో నడుస్తుంది. అయితే కొన్ని కారణాల వలన సంబంధిత సన్నివేశాలను కేరళ అడవుల్లో చిత్రీకరించనున్నారు. మార్చి 13వ తేదీ నుంచి తాజా షెడ్యూల్ షూటింగ్ మొదలుకానుంది. ఇందులో రాయలసీమ యాసలో బన్నీ మాట్లాడనుండటం విశేషం.