అనసూయ….తల్లా? పెళ్లామా?!

519
anasuya

బుల్లి తెర,వెండి తెరపై తనదైన శైలీలో నటిస్తూ మెప్పిస్తున్న బ్యూటీ అనసూయ. ఓ వైపు టీవీ షోలు మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్న రంగమ్మత్త తాజాగా మరో అప్ డేట్ ఇచ్చేసింది. ఇప్పటికే ఈటీవీలో జబర్దస్త్…జీ తెలుగులో లోకల్ గ్యాంగ్‌..ఈటీవీలో ప్రతిరోజు పండగే లాంటి కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది.

ఇక తాజాగా జెమినీ ఛానల్‌లో అడుగుపెట్టింది ఈ బ్యూటీ. తల్లా..?పెళ్లామా..? అనే కొత్త కార్యక్రమంతో సందడిచేయబోతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను ఫేస్ బుక్ ద్వారా షేర్ చేసింది అనసూయ.

పొట్టి బట్టలతో హాట్ నెస్‌ను మేళవించి షోపై అంచనాలను పెంచేసింది. జీవితం అనే చదరంగం ఆటలో తల్లా? పెళ్లమా? నా ప్రశ్నకు జవాబు చెప్పాలని చెప్పే అనసూయ కొత్త కార్యక్రమానికి సంబంధించిన ప్రొగ్రామ్ అందరిని ఆకట్టుకుంటోంది.