తన క్యూట్ ఎక్స్ప్రెషన్తో యూత్ నే కాదు..సెలెబ్రిటీలను సైతం అట్రాక్ట్ చేసింది ప్రియా ప్రకాశ్ వారియర్. ప్రియా నటించిన ‘ఓరు అదార్ లవ్’లోని ‘మానిక్యా మలారాయ పూవి’ అనే సాంగ్లో ప్రియా తన లవ్ ఎక్స్ ప్రెస్ చేసే విధానానికి బన్నీ కూడా ఫ్లాట్ అయిన విషయం తెలిసిందే.
వెంటనే తన ట్విట్టర్ ఎకౌంట్లో వీడియోని షేర్ చేస్తూ.. ఈ మధ్య కాలంలో ఇంత క్యూటెస్ట్ వీడియో చూడలేదు. సింప్లిసిటీకి ఉన్న పవరే ఇది. నాకు బాగా నచ్చింది అంటూ కామెంట్ పెట్టాడు.
అయితే తాజాగా..అల్లు అర్జున్ తన తనయుడితో ఈ యాక్ట్ ట్రై చేశాడు. ప్రియాలా మారిన అర్జున్ తన వేళ్ళకి ముద్దు పెట్టి , బల్లపై ఉన్న కుమారుడికి గురి పెట్టాడు. దీంతో వెంటనే అయాన్ టేబుల్ పై నుండి బెడ్ పైకి జంప్ చేశాడు. ఈ వీడియోని బన్నీ సతీమణి ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేయగా, ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తెలుగు అభిమానులే కాదు మలయాళీ అభిమానులు కూడా ఈ క్యూట్ వీడియోని వైరల్ చేశారు. బన్నీ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో నా పేరు సూర్య చిత్రం చేస్తుండగా, ఈ మూవీ మే 4న తెలుగు, మలయాళ భాషల్లో రిలీజ్ రెడీగా ఉంది.