ఒకవైపు కాటమరాయుడు టీజర్ రిలీజ్ అయ్యి, యూట్యూబ్ లో దుమ్మురేపింది. మెగాస్టార్ చిరంజీవి సైతం తమ్ముడి సత్తాపై ఉబ్బితబ్బిబయ్యాడు. స్వయంగా పవన్ కు ఫోన్ చేసి, టీజర్ అదరిపోయిందటూ కామెంట్స్ చేశాడు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఈ టీజర్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పోనీ, బన్నీ ఏ చిత్రాలపై కామెంట్స్ చేయడా అంటే.. గతంలో చాలా సినిమాలపై తన అభిప్రయాలను చెప్పిన సందర్భాలున్నాయి.
గౌతమిపుత్ర శాతకర్ణి, శతమానం భవతి చిత్రాలకి కూడా అల్లు అర్జున్ తన బెస్ట్ విషెస్ అందజేసాడు. కానీ పవన్‌కళ్యాణ్ సినిమా గురించి మాత్రం మౌనం పాటిస్తున్నాడు. అతని తమ్ముడు శిరీష్ కూడా ‘కాటమరాయుడు’ గురించి స్పందించలేదు. చెప్పను బ్రదర్ కామెంట్స్ తో బన్నీ పవన్ అభిమానుల ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ హీరో తీరుచూస్తుంటే.. పవన్ విషయంలో ‘చెప్పను బ్రదర్’ స్లోగన్‌కే ఫిక్సైపోయినట్లున్నాడు. ఈ నేపధ్యంలో పవన్ ఫ్యాన్స్ బన్నీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.