ప‌వ‌న్ కు మ‌ద్ద‌తుగా అల్లు అర్జున్ పెట్టిన ఫోటో వైర‌ల్..

429
BANNY, KALYAN
- Advertisement -

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు స్టైలిష్ అల్లు అర్జున్ కు  ప‌డ‌టం లేద‌ని కొద్ది క్రితం వార్త‌లు వ‌చ్చాయి. అందుకు తోడుగా ఓ ఫంక్ష‌న్ కి హాజ‌ర‌యిన అల్లు అర్జున్ అక్క‌డ ప‌వ‌న్ ఫ్యాన్స్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి మాట్లాడాల‌ని అర‌వ‌డంతో చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అంటూ స‌మాధానం ఇచ్చాడు. దీంతో అప్ప‌టి నుంచి అల్లు అర్జున్ కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు మ‌ధ్య ఏదో వైరం ఉంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. అప్ప‌టి నుంచి అల్లు అర్జున్ పై చాలా సీరియ‌స్ గా ఉన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ వీరాభిమానులు. ఒక‌ప్పుడు మెగా ఫ్యామిలి మొత్తం ఒక‌వైపు ఉంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం మ‌రోవైపు ఉండేవాడు. కానీ ప్ర‌స్తుతం మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన హీరోలంద‌రూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెంటే న‌డవ‌టానికి సై అంటున్నారు.

BANNY, KALYAN

ఇక ప‌వ‌న్, అల్లు అర్జున్ మ‌ధ్య గొడ‌వ‌లున్నాయ‌ని టాలీవుడ్ లో కొద్ది రోజుల క్రితం ఈ చ‌ర్చ న‌డిచింది . కొద్ది రోజుల క్రితం ఫిలిం ఛాంబ‌ర్ వ‌ద్ద ప‌వ‌న్ చేప‌ట్టిన నిర‌స‌న‌కి మ‌ద్ద‌తు తెలుపుతూ అక్క‌డికి బ‌న్ని రావ‌డంతో ఆ రూమ‌ర్స్ కి బ్రేక్ ప‌డింది. ఇక మొన్న రీలిజైన నాపేరు సూర్య నాఇల్లు ఇండియా మూవీ స‌క్సెస్ మీట్ కు ప‌వ‌న్ ముఖ్య అతిధిగా హాజ‌రైన విషయం తెలిసిందే. దీంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు బన్నికి మ‌ధ్య ఎలాంటి వైరం లేద‌ని తేలిపోయింది. తాజాగా అల్లు అర్జున్ త‌న ఫెక్ బుక్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు సంబంధించి ఫోటో ఒక‌టి పోస్ట్ చేశాడు.

BANNY, KALYAN

ఈపోస్ట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కోడుతోంది. “లివ్ బై యువర్ ట్రూ మ్యాడ్‌నెస్ ద వరల్డ్ విల్ అడ్జస్ట్ అని ప‌వ‌న్ కు మ‌ద్ద‌తుగా బ‌న్ని పోస్ట్ చేశాడు. దీంతో అటు ప‌వ‌న్ అభిమానులు, ఇటు బ‌న్ని అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ర్మిష‌న్ ఇస్తే 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన త‌ర‌పున ప్ర‌చారం చేస్తామ‌ని ఇప్ప‌టికే ప‌లువురు మెగా హీరోలు చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు బ‌న్ని పెట్టిన పోస్ట్ తో ప‌వ‌న్ కు బ‌న్ని కి ఎటువంటి వైరం లేద‌ని తేలిపోయింది.

- Advertisement -