- Advertisement -
కరోనా నుంచి కోలుకున్న వారిలో మ్యూకోర్‌మైకోసిస్ ( Mucormycosis ) అని పిలిచే ఈ ఇన్‌ఫెక్షన్ తాలూకూ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ ఫంగస్ కారణంగా కరోనా నుంచి కోలుకున్న వారిలో కొద్దిమంది కంటిచూపు కోల్పోవడం.. మరికొందరు అయితే ప్రాణాలను కోల్పోవడం ఇప్పుడు అందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ముకోర్మైకోసిస్(బ్లాక్ ఫంగస్) చికిత్సలో ఉపయోగించే యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్ లు రాష్ట్రాలకు కేటాయింపులు చేసింది. దేశంలో ముకోర్మైకోసిస్ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అదనపు కేటాయింపులు చేసింది కేంద్ం. తాజాగా 80,000 యాంఫోటెరిసిన్-బి వయల్స్ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా కేటాయించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి 4,140 యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లు కేటాయించింది.
- Advertisement -