సీఎం కేసీఆర్ నా ప్రాణాలు కపాడారు: అల్లరి సుభాషిణి

267
subhashini
- Advertisement -

జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారంలో రెండు రోజుల పాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే షో ఇది. ఈ ఒక్క షోతో చాలా మంది కమెడియన్ల జీవితాలు మారిపోయాయి. ఇక ఈ వేదిక ద్వారా సినిమా ప్రమోషన్లు,సీనియర్ నటీ,నటులు వస్తూ హాస్యాన్ని పండిస్తుంటారు.

తాజాగా జరిగిన లేటెస్ట్ ఎపిసోడ్‌లో అల్లరి సుభాషిణి జబర్దస్త్ వేదికగా నవ్వులు పూయించారు. ఈ సందర్భంగా తన ఆరోగ్య పరిస్థితి గురించి చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. తనకు క్యాన్సర్ వచ్చి చివరి దశ వరకు వెళ్లానని తనను సీఎం కేసీఆర్ ఆదుకున్నారని చెప్పారు. ఆపరేషన్‌కు 14 -15 లక్షలు అవుతుందని డాక్టర్లు చెబితే ఆరోగ్య శ్రీ కార్డు ఇప్పించడంతో కేవలం 5 వేలతో బ్రతికానని తెలిపారు. తనను కాపాడిన సీఎం కేసీఆర్, డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు. తల్లిదండ్రులు చేసిన పుణ్యం వల్ల బిడ్డలకు ఎప్పుడూ మంచే జరుగుతుందన్నారు.

రంగస్థల ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయం అయ్యారు సుభాషిణి. నటుడు చలపతిరావు కుమారుడు రవిబాబు దర్శకత్వం వహించిన అల్లరి సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు సుభాషిణి. తర్వాత చాలా సినిమాలలో నటించారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీఆంజనేయంలో ముఖ్య పాత్రను పోషించింది. బాలకృష్ణ, ఎన్టీఆర్, నాగార్జున, చిరంజీవి, రజినీకాంత్ వంటి నటులతో నటించారు.

- Advertisement -