అల్లరి నరేష్ లేటెస్ట్ మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ రేపే రిలీజవుతోంది. నాంది తర్వాత సీరియస్ కథతో నరేష్ చేసిన ఈ సినిమాపై ఓ మోస్తారు అంచనాలు ఉన్నాయి. అయితే సినిమాకు రావల్సినంత బజ్ మాత్రం లేదు. ఇక రేపు అల్లరి నరేష్ సినిమాతో పాటే తోడేలు’, ‘లవ్ టుడే’ అనే డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఈ రెండు సినిమాలు తెలుగులో మంచి కలెక్షన్స్ అందుకునే చాన్స్ ఉంది. హిందీలో భారీ మూవీ గా తెరకెక్కిన తోడేలు తెలుగు ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఏదో కొత్తదనం కనిపిస్తుంది. ఇక లవ్ టుడే విషయానికొస్తే ఈ సినిమా తమిళ్ లో బ్లాక్ బస్టర్ అనిపించుకుంటుంది. ఇప్పటికే అక్కడ 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. తెలుగులో సరైన ప్రమోషన్స్ లేదు కానీ రేపు రిలీజ్ తర్వాత యూత్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్య ఈ తరహా యూత్ సినిమా రాలేదు. పైగా ట్రెండీ లవ్ స్టోరీ తో తెరకెక్కిన ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందనడం సందేహం లేదు. అందుకే దిల్ రాజు ఏరి కోరి మరీ తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు.
ఇలా రెండు డబ్బింగ్ సినిమాల నడుమ అల్లరి నరేష్ సినిమా రిలీజ్ అవుతుంది. బహుశా తెలుగు ప్రేక్షకులు ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం కే మొదటి ఓటు వేయొచ్చు కానీ రెండో రోజు డబ్బింగ్ సినిమాలు పబ్లిక్ టాక్ తో పున్జుకుంటే అల్లరిడికి ఎఫెక్ట్ అవుతుంది. ఏదేమైనా అల్లరోడికి డబ్బింగ్ సినిమాలతో రిస్క్ ఉన్నట్టే.
ఇవి కూడా చదవండి…