కామెడీ చిత్రాల కథానాయకుడు అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం మేడమీద అబ్బాయి జాహ్నవి ఫిల్మ్స్ పతాకంపై బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. నిఖిల విమల్ కథానాయిక. మలయాళంలో ఘనవిజయం సాధించిన ఒరు వడక్కం సెల్ఫీ చిత్రానికి రీమేక్ ఇది. మాతృకకు దర్శకుడైన జి.ప్రజిత్ తెలుగు రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు.
నరేష్ నటించిన ‘మేడ మీద అబ్బాయి’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మధ్య కాలంలో తాను చేసిన సినిమాల్లో తనకి కొత్తగా అనిపించిన చిత్రం ‘మేడ మీద అబ్బాయి’ అని అల్లరి నరేశ్ చెప్పాడు. ఈ సినిమా తాను ఇంతవరకూ చేసిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని అన్నాడు.
ట్రాక్ మార్చమని కొంతకాలంగా తనకి నాని చెబుతూ వస్తున్నాడనీ, ఆయన సలహా మేరకు రూట్ మార్చి చేసిన చిత్రం ‘మేడ మీద అబ్బాయి’ అని చెప్పాడు. ఈ సినిమా తరువాత రైటర్స్ తనని చూసే యాంగిల్ కూడా మారుతుందనీ, కొత్త కాన్సెప్ట్స్ తో కూడిన కథలతో తన దగ్గరికి దర్శకులు వస్తారనే నమ్మకం ఉందని అన్నాడు. కుటుంబ సమేతంగా చూసేలా ఈ సినిమా తెరకెక్కిందనీ, తాను ఆశిస్తోన్న హిట్ ఈ సినిమాతో దొరుకుతుందని చెప్పుకొచ్చాడు.