టాలీవుడ్ కి కొత్త భామల తాకిడి ఎక్కువ అయింది. తమిళం,మలయాళంలో నటిస్తున్న భామలు కూడా తెలుగులో సత్తా చూపేందుకు రెడీ అంటున్నారు. వారొస్తారంటే..మేమొద్దంటామ.. అన్నట్లు మన దర్శక నిర్మాతలు టాలీవుడ్ ఆడియన్స్ కి కొత్త హీరోయిన్స్ ని పరిచయం చేస్తున్నారు. ప్రస్తుతం మరో హీరోయిన్ తెలుగు తెరకు పరిచయం కానుంది.
కొద్ది రోజులుగా వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న అల్లరోడు ఒరు వడక్కన్ సెల్ఫీ అనే మలయాళ సినిమాను ప్రజీత్ దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 16 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన హీరోయిన్ గా నిఖిలా విమల్ ను తీసుకున్నారు. ఈ భామ తన అందాలతో పాటు నటనతోను టాలీవుడ్ ఆడియన్స్ ని ఎంటర్‌టైన్ చేస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. ఇక నరేష్ సినిమాల్లో ఎక్కువగా కొత్త హీరోయిన్సే కనబడుతారు. మొత్తానికి ఇప్పుడు కూడా ఈ అల్లరోడి కన్ను కొత్త పిల్లమీద పడింది..!