అల్లరి నరేష్ కీలక నిర్ణయం

42
- Advertisement -

తెలుగు వెండితెరపై నేటి నవ్వుల రారాజు అల్లరి నరేష్ పుట్టినరోజు నేడు. 2002లో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘అల్లరి’ సినిమాతో హీరోగా పరిచయమై.. కామెడీ స్టార్‌గా తనకంటూ ఓ ప్రత్యేకతను దక్కించుకున్నాడు. తర్వాత నేను, ప్రాణం, గమ్యం వంటి సినిమాలు చేసి తన నటనలోని మరో కోణాన్ని చూపించాడు. ఇక వరుసగా కామెడీ సినిమాలు ఫ్లాప్ అవుతుంటే కామెడీని వదిలి సీరియస్ సినిమాల వైపు ‘నాంది’ సినిమాతో అడుగేశాడు.

ఇక తాజాగా అల్లరి నరేశ్‌ కొత్త సినిమా అప్‌డేట్ వచ్చింది. నరేశ బర్త్‌ డే సందర్భంగా ‘N62’ సినిమా గురించి మేకర్స్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో బార్‌లో నరేశ్, దర్శకుడు సుబ్బు మంగాదేవి కథ గురించి డిస్కస్ చేశారు. రాజేశ్ దండా, బాలాజీ గుట్ట తెరకెక్కిస్తున్న ఈ మూవీకి విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా అల్లరి నరేష్ సినీ జీవితంలో ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తోంది అని.. సినిమాలో బలమైన కంటెంట్ ఉందని టాక్.

Also Read: శ్రీలీల లవ్ కి బ్ర‌హ్మానందం హెల్ప్

మొత్తానికి కామెడీని మాత్రమే కాకుండా.. గత నాలుగేళ్లుగా అల్లరి నరేష్ సీరియస్ నెస్ ను కూడా నమ్ముకుంటూ సక్సెస్ అందుకుంటున్నాడు. కానీ అల్లరి నరేష్ సినిమాలు ఇష్టపడే వారు మాత్రం.. మళ్లీ అల్లరి నరేష్ కామెడీ చిత్రాలే ఎక్కువుగా చేయాలని కోరుకుంటున్నారు. నరేష్ కూడా ప్రతి సంవత్సరం కనీసం ఓ కామెడీ సినిమా అయినా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాడు. అందుకే ఇది తన కెరీర్ లోనే కీలక నిర్ణయం అని చెబుతున్నాడు నరేష్.

Also Read: సురేఖా వాణిని ఇబ్బంది పెడుతున్నారు

- Advertisement -