అల్లరి నరేష్..ఇంట్రెస్టింగ్ కామెంట్స్

6
- Advertisement -

హీరో,నటుడు అల్లరి నరేష్ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. తనదైన కామెడీ టైమింగ్‌కు మరియు సహజమైన నటనకు పేరుగాంచిన నటుడు అల్లరి నరేష్ నటించిన ’12A రైల్వే కాలనీ’ శుక్రవారం విడుదల కానుంది.

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ.. నా హిట్ల కంటే నా ఫ్లాపులే నాకు ఎక్కువ విజయాన్ని ఇచ్చాయి అని అన్నారు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఈ నటుడు, వైఫల్యాలే తనకు మరింత స్థైర్యాన్ని నేర్పాయని, తనను మెరుగైన నటుడిగా మలిచాయని చెప్పారు.

చాలా కాలం విరామం తర్వాత, నరేష్ అరుదుగా ఎంచుకునే ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ జానర్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్‌తో సినిమాపై అంచనాలను పెంచేయగా ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచిచూడాలి.

Also read:కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా చట్టాలా?

- Advertisement -