‘నాంది’ తో విజయవంతమైన చిత్రాన్ని అందించిన అల్లరి నరేష్, విజయ్ కనకమేడల మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ ‘ఉగ్రం’ తో వస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్‌గా నిర్మించారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ఉగ్రంపై అంచనాలని పెంచింది. మే 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఈ రోజు ఖమ్మంలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
ట్రైలర్ ఉగ్రం కథాంశాన్ని ఆసక్తికరంగా రివిల్ చేసింది. నగరంలో మిస్సింగ్ కేసుల వెనుక ఉన్న కొంతమంది పవర్ ఫుల్ వ్యక్తులపై నిజాయితీ గల పోలీసు భారీ రిస్క్ తీసుకొని చేసిన పోరాటం ఉగ్రం. అతని కుటుంబాన్ని కూడా టార్గెట్ చేస్తారు. అయితే అతను కేసును ఛేదించి, నేరస్థులను పట్టుకోవడానికి మొగ్గుచూపుతాడు. ట్రైలర్‌లో అల్లరి నరేష్ కొత్తగా, మునుపెన్నడూ చూడని ఫెరోషియస్ పాత్రలో కనిపించారు. ముఖ్యంగా, ట్రైలర్ రెండవ సగం అతన్ని బ్రూటల్ అవతార్‌లో ప్రజంట్ చేసింది. ట్రైలర్ ఇంటెన్సివ్, గ్రిప్పింగ్, రివిటింగా ఉంది విజయ్ కనకమేడల పాత్రను ఇంటెన్స్ గా ప్రజంట్ చేయడంతో పాటు సబ్జెక్ట్‌ని ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. ట్రైలర్‌లో యాక్షన్‌తో కూడిన ఎంటర్‌టైనర్‌కు హామీ ఇస్తుంది. సిద్ టాప్-నాచ్ సినిమాటోగ్రఫీ, శ్రీచరణ్ పాకాల అద్భుతమైన బీజీఏం గ్రేట్ వాల్యుని జోడించాయి. నరేష్ భార్యగా మిర్నా కనిపించింది. అద్భుతమైన పెర్ఫార్మెన్స్, ఫస్ట్-క్లాస్ టెక్నికాలిటీస్ తో ట్రైలర్ అంచనాలని పెంచింది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ఈ ఈవెంట్ కి వచ్చి మాకు బెస్ట్ విశేష్ అందించిన మంత్రి అజయ్ కుమార్ గారికి కృతజ్ఞతలు. ఉగ్రం నా సినిమా షష్టిపూర్తి. 60వ చిత్రం (నవ్వుతూ). మహర్షి తర్వాత నాంది కథ చెప్పారు. నాపై కామెడీ ఇమేజ్ వుంది కదా చూస్తారా ? అనిఅడిగాను. రిస్క్ చెద్దామని అన్నారు. ఆ రిస్క్ పే చేసింది. మళ్ళీ ఉగ్రం కథ చెప్పినపుడు ఇంత యాక్షన్ సీక్వెన్స్ లు చూస్తారా ? అంటే నమ్మండి సార్ అన్నారు. ఆ రోజు నుంచి అందరం కసిగా పని చేశాం. ట్రైలర్ లోనే ఇలా వుందంటే సినిమాలో ఇంకా ఎక్కువ వుండబోతుంది. ఉగ్రం టీం వర్క్. అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. నిర్మాతలు సాహు , హరీష్ పెద్ది బ్యానర్ లో సినిమా చేయడం చాలా అనందంగా వుంది. ఏమున్నా హరీష్ మొహంలో తెలిసిపోతుంది. కానీ సాహు మాత్రం రేసుగుర్రంలో శ్రుతి హాసన్ టైపు.(నవ్వుతూ) అలాంటి ఆయన కూడా ఉగ్రం ట్రైలర్ చూసి చాలా బావుందని చెప్పడం పెద్ద కాంప్లీమెంట్ అనిపించచింది. మే 5న సినిమా మీ ముందుకు వస్తోంది. నాందిలో అండర్ ట్రయిల్ ఖైదీలు గురించి చెప్పాం. ఉగ్రం లో మిస్సింగ్ కేసులు గురించి చెప్పాం. చాలా రిసెర్చ్ చేసిన కథ ఇది. నాంది కంటే పదిరెట్లు ఇంటెన్స్ వుంటుంది’’ అన్నారు.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. నరేష్ గారు, విజయ్.. ఉగ్రం టీం అందరికీ అభినందనలు. నాంది లాంటి మంచి సినిమాతో నరేష్ గారిని సక్సెస్ వైపు నడిపిన దర్శకుడు విజయ్ కి అభినందనలు. నరేష్ గారికి ప్రత్యేక అభినందనలు. నాంది నరేష్ గారికి ప్రత్యేకమైన సినిమా. అలాగే గమ్యంలో చేసిన పాత్ర కూడా మర్చిపోపోలేనిది. మహర్షి సినిమాలో చేసిన పాత్ర కూడా అద్భుతంగా వుంటుంది. నరేష్ గారు హాస్య ప్రధాన పాత్రల నుంచి సీరియస్ పాత్రల వైపు మళ్ళారు. విజయాలు కూడా ఒకదానికి తర్వాత ఒకటి వస్తున్నాయి. అందులో ఉగ్రం పతాకస్థాయికి ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. నిజంగానే ఉగ్ర రూపం దాల్చారు. యాక్షన్ హీరోగా పోలీస్ పాత్రలో ఫ్యామిలీ బాధ్యత వున్న కథతో రావడం అభినందనీయం. విజయ్ తీసిన నాంది కరోనా సమయంలో కూడా పెద్ద విజయాన్ని సాధించింది. ఇప్పుడు కరోనా సమస్యల నుంచి బయటపడిన సమయం కాబట్టి ఉగ్రం థియేటర్స్ లో పెద్ద హిట్ అవుతుందని బలంగా భావిస్తున్నాం. ఉగ్రం సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలవాలని కోరుకుంటూ టీం అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు
దర్శకుడు విజయ్ కనకమేడల మాట్లాడుతూ.. ఉగ్రం, నాందికి పదిరెట్లు వుంటుంది. నాంది లానే ఇందులో కూడా ఒక సోషల్ కాజ్ వుంటుంది. మిస్సింగ్ అనే యూనిక్ పాయింట్ ని తీసుకొని ఈ కథ చేశాం. చాలా ఎమోషన్, ఉగ్ర రూపంలో వుంటుంది. యాక్షన్ దద్దరిల్లుతుంది. ఇది నరేష్ గారికి 60వ చిత్రం. 59 సినిమాలకి ఎంత కష్టపడ్డారో అంత కష్టం ఈ ఒక్క సినిమాకి పడ్డారు. మే 5న సినిమా వస్తోంది. ఫస్ట్ హౌస్ ఫుల్ బోర్డ్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి’’ అన్నారు.
నిర్మాత హరీష్ పెద్ది మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని బ్లెస్ చేసిన మంత్రి గారికి కృతజ్ఞతలు. ఉగ్రం సినిమాని నరేష్ గారు, విజయ్ గట్టి నమ్మకంతో యజ్ఞంలా చేశారు . మే 5న అందరూ థియేటర్ లో చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను’’ అన్నారు.అబ్బూరి రవి మాట్లాడుతూ.. ఉగ్రం దర్శకుడు విజయ్ విజన్. దానికి టీం అంతా సపోర్ట్ చేసింది. నరేష్ గారిని ఉగ్రరూపంలో చూపించలేమా ? అనే ప్రశ్నే ఈ సినిమాకి ఆరంభం. ప్రతి ఒక్క సీను అందరికీ నచ్చేలా ఈ కథ తయారూ చేయడం జరిగింది. ఇది నమ్మి చేసిన సినిమా. డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేసిన తీసిన ఈ సినిమాకి ప్రేక్షకుల సపోర్ట్ ఇస్తారనే నమ్మకం వంది’’ అన్నారు.
తూమ్ వెంకట్ మాట్లాడుతూ.. మన కుటుంబ సభ్యులు గానీ తెలిసిన వారు కానీ కనిపించకుండాపొతే ఎలా బాధపడతామో.. ఉగ్రంలో ఎమోషన్ ని చూపించాం. ఉగ్రం లో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వుంటాయి. మే 5న ఉగ్రం వైబ్స్ ని థియేటర్ లో చూస్తారు’’ అన్నారు. ఈ ఈవెంట్ లో ఉగ్రం టీం తదితరులు పాల్గొన్నారు.