జర్నలిస్టుల అక్రెడిటేషన్ పాలసీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీ ఓ నం.252 ను వ్యతిరేకిస్తూ… డెస్క్ జర్నలిస్టుల కు అక్రెడిటేషన్లు రద్దు చేయడం… పెద్ద సంఖ్యలో జర్నలిస్టుల అక్రెడిటేషన్ లను కుదించడం పై నిరసనగా,శనివారం (27.12.2025) అన్ని జిల్లాల కలెక్టరు కార్యాలయాల జర్నలిస్టులు నిరసన చేపట్టనున్నారు. ముందు తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ..
ఈ సందర్భంగా, TUWJ అధ్యక్షులు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ మీడియా నుద్దేశించి మాట్లాడారు. రెండు కార్డుల సిద్ధాంతంతో జర్నలిస్టుల నడుమ చిచ్చు పెడితే సహించం…డెస్క్ జర్నలిస్టుల మీద ఎందుకు వివక్ష?..తెలంగాణ రాష్ట్ర సాధన లో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులకు కనీస గుర్తింపును కూడా రద్దు చేస్తారా?,తెలంగాణ జర్నలిస్టుల హక్కులను కాపాడుకోవడానికి మరో పోరాటానికి TUWJ TJF సదా సిద్ధం అన్నారు.
లోపభూయిష్టమైన జీవో 239 ను తక్షణమే ఉపసంహరించుకోవాలే..కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 252 ను రద్దు చేయడం…. తెలంగాణ జర్నలిస్టుల హక్కులను కాలరాయడమే…డెస్క్ జర్నలిస్టులను అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి పగబట్టడం అన్యాయం అన్నారు. 23 వేల మంది జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇచ్చిన ఘనత గత ప్రభుత్వానిదే…నూతన తెలంగాణ రాష్ట్రంలో త్యాగాలు చేసిన జర్నలిస్టులందరికీ బేధం లేకుండా అక్రిడేషన్లు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్..జర్నలిస్టుల జాతరలో పదివేల మందిలో జర్నలిస్టుల సంక్షేమ పాలసీని ప్రకటించిన కేసీఆర్..ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలినాళ్లలోనే జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి.. సీనియర్ జర్నలిస్టులు రామచంద్రమూర్తి తదితర ప్రముఖుల ఆధ్వర్యంలో అకాడమీలో సీనియర్ జర్నలిస్టులతో చర్చించి పాలసీని నిర్ణయించారు నాటి సీఎం కేసీఆర్ అన్నారు.
డెస్క్ జర్నలిస్టులకు కూడా ప్రాముఖ్యతనిచ్చి అక్రిడేషన్లు ఇవ్వాలని, నాటి ముఖ్యమంత్రితో సమావేశంలోనే నిర్ణయించడం జరిగింది..మహిళా జర్నలిస్టుల భాగస్వామ్యం ఉండాలని 33% మహిళలకు కూడా కేటాయించిన ఘనత నాటి కెసిఆర్ ప్రభుత్వానికి నాటి మీడియా అకాడమీదే..నాటి కెసిఆర్ ప్రభుత్వంలో జారీ చేసిన 239 జీవో స్ఫూర్తి కి గండి కొట్టి విధంగా నేటి 252 జీవో ఉన్నది.. దానిని తక్షణమే రద్దు చేయాలి..నాడు కల్చరల్ రిపోర్టర్లకు, స్పోర్ట్స్ రిపోర్టర్లకు, ఇట్లా ప్రతి ఈ విభాగానికి ఆ విభాగానికి విడివిడిగా అక్రిడేషన్లు జారీ చేసినం. కానీ ఇప్పుడు అవన్నీ రద్దు చేయడం దుర్మార్గం అన్నారు.
వార్తా సేకరణలో ఫీల్డ్ జర్నలిస్టులది ఎంతటి కీలక పాత్రనో… వార్తను తీర్చి దిద్దడంలో డెస్క్ జర్నలిస్టులది అంతే కీలక పాత్ర..ఈ నేపథ్యంలో.. డెస్క్ జర్నలిస్టుల అక్రిడేషన్లు రద్దు చేయడం అంటే పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడమే..పెద్ద పత్రికలకు పెద్ద చానళ్ల జర్నలిస్టులకు గుర్తింపు కార్డులను కోత విధించడం సరికాదు..
కేబుల్ ఛానల్ ను దారుణంగా నిర్లక్ష్యం చేశారు..మండల స్థాయిలో పనిచేసిన జర్నలిస్టు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా భాగస్వాములు అయ్యారు..తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకు పోవడంలో వారి పాత్ర గొప్పది..వారిని గుర్తించిన నాటి సీఎం కేసీఆర్ అక్రిడేషన్లు సహా అన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు..వారికి నేడు కనీస గుర్తింపు కూడా ఇవ్వకపోవడం అన్యాయము..కరోనా వంటి కష్టకాలంలో జనులకు జర్నలిస్టులకు అండగా నిలిచింది నాటి మీడియా అకాడమీ నాటి కెసిఆర్ ప్రభుత్వమేనన్నారు.
దేశంలో మరెక్కడా లేనివిధంగా,తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ నిధికి 100 కోట్ల నిధులు ఏర్పాటు చేయడానికి సంకల్పించి, నాటి కెసిఆర్ ప్రభుత్వం 42 కోట్లు కేటాయించడం జరిగింది..మీరు అంతకంటే గొప్పగా ఏమైనా చేస్తే చేయండి కానీ ఉన్నవి కూడా పీకడం జర్నలిస్టుల నోట్లో మట్టి కొట్టడమే… పత్రికా యాజమాన్యాలు జర్నలిస్టులకు ఐడీ కార్డు ఇస్తున్నప్పుడు దానిమీద రిపోర్టర్ కం సబ్ ఎడిటర్ అనే ఉంటుంది.. మారిన కాలమాన పరిస్థితులలో జర్నలిస్టులు ఫీల్ మీద డెస్క్ మీద మల్టీపుల్ గా పనిచేస్తారు…ఎవరిని ఎక్కడ వినియోగించుకోవాలో నిర్ణయించుకోవాల్సింది ఆయా పత్రికల చానల్లో యజమానులు ఎడిటర్లు మాత్రమే… ప్రభుత్వము కాదు..భవిష్యత్తులో జీవో నెంబర్ 252 ద్వారా పత్రికా సంస్థల యాజమాన్యాలకు కూడా సమస్యగానే మారుతుంది.. అక్రిడేషన్ల కుదింపు.. రద్దు.. జర్నలిస్టు వృత్తికి తీరని నష్టం అన్నారు.
నాటి 239 జీవోలు ఉన్న లోపాలు ఏమిటో చర్చకు సిద్ధమా..?, అది సమగ్రమైన జీవో అని మేము నిరూపిస్తాం ..డెస్క్ జర్నలిస్టుల మీద కక్ష తీర్చుకోవడం తప్ప మరొకటి కాదు ..వారిని రెండవ శ్రేణి పౌరులుగా చూస్తూ మీడియా కార్డు పేరుతో వాళ్ళ అక్రిడేషన్ను హక్కును రద్దు చేయడం చూస్తూ ఊరుకోం..జర్నలిస్టుల అందరి హక్కుల కోసం టియుడబ్ల్యూజేఎఫ్ పోరాడడానికి ఎల్లవేళలా ముందంజలో ఉంటుంది..అందరితో కలిసి పోరాటం ఉదృతం చేస్తాం…జర్నలిస్టులందరూ టిడబ్ల్యూఏ పోరాటంలో కలిసి ముందుకు రావాలి ..ఫ్రీలాన్స్ జర్నలిస్టులకు అర్హత 10 ఎండ్లనుంచి 15 ఏండ్లకు పెంచడం సీనియర్ జర్నలిస్టుల హక్కులను హరించడమేనన్నారు. ఇంకా అనేక విధాలుగా జర్నలిస్టుల హక్కులను కాలరాస్తూ., ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తూ, వివాదాస్పద జీవో విడుదలకు కారణమైన మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 252 జీవో ను సవరించకుంటే జర్నలిస్టుల ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని మారుతి సాగర్ హెచ్చించారు.శనివారం నాడుతెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఫీల్డ్ మరియు డెస్క్ జర్నలిస్టుల కు పిలుపునిచ్చారు.
Also Read:వాయు కాలుష్యం..ఊపిరితిత్తుల సమస్య!

