వైసీపీ గూటికి ఆర్కే..ఇంతలోనే ఏమైంది?

25
- Advertisement -

ఆ మధ్య వైసీపీ పై అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించి పార్టీకి గుడ్ పై చెప్పిన మంగళగిరి ఎమ్మెల్యే అల్లా రామకృష్ణారెడ్డి రెండు నెలలు గడవకముందే తిరిగి సొంత గూటికి చేరారు. దీంతో ఇంత సడన్ గా ఆర్కే ఎందుకు మళ్ళీ వైసీపీలోకి వచ్చారు ? ఆర్కే వైసీపీలోకి రావడం వెనుక ఏం జరిగింది ? అనేది ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఆళ్ల రామకృష్ణ రెడ్డి. గత నెలలో షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుడుకున్నారు. దీంతో మంగళగిరిలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫలితంగా ఈసారి వైసీపీ నుంచి మంగళగిరి బరిలో దిగేదెవరు అనే ప్రశ్నలు తలెత్తాయి. గత ఎన్నికల్లో నారా లోకేష్ ను ఓడించి మంగళగిరిలో విజయం సాధించారు ఆళ్ల రామకృష్ణ రెడ్డి.

ఈసారి మంగళగిరిలో గెలుపుపై నారా లోకేశ్ ఫుల్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం సర్వేలు కూడా మంగళగిరిలో లోకేష్ గెలుపు ఖాయమని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీలో లోకేష్ కు పోటీనిచ్చే సరైన అభ్యర్థి కొరత ఉన్నందున ఆర్కేను వైఎస్ జగన్ మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించినట్లు వినికిడి. మొదట మంగళగిరి సీటును ఆర్కే కు నిరాకరించినప్పటికి ప్రస్తుతం లోకేష్ ను ఎదుర్కోవాలంటే ఆర్కేనే కరెక్ట్ అనే భావనతో జగన్ వ్యూహాత్మకంగా ప్లాన్ చేసి ఆయనకు వెల్కం చెప్పినట్లు టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వైసీపీలో మంగళగిరి సీటు కోసం గట్టిగానే పోటీ నడుస్తోంది. నిన్నమొన్నటి వరకు గంజి చిరంజీవి పేరు ప్రధానంగా వినిపించినప్పటికి ప్రస్తుతం ఆర్కే తిరిగి వైసీపీలో చేరడంతో మంగళగిరి సీటు ఆయనకే కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీలో చేరడంతో మంగళగిరి కేంద్రంగా రాజకీయాలు వేడెక్కాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read:ఎక్కువసేపు కూర్చుంటే.. ఎన్ని ప్రమాదాలో ?

- Advertisement -