యూపీఐ హద్దు మీరద్దు…

434
- Advertisement -

నగదును రోజువారి లావాదేవీలను నిత్యం ఎదో సందర్భంలో ఉపయోగిస్తాము. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు క్యాష్‌తో పని ఉంటుంది. అయితే గత కొన్ని సంవత్సరాలగా నగదును చేతితో కాకుండా ఫోన్ ద్వారా బదిలీ చేయడం ప్రారంభించారు. దీంతో మనకు నిత్యం ఆన్‌లైన్‌ ద్వారా నిత్యం ఎదో ట్రాన్స్‌క్షన్ జరుగుతోంది.

దీని కోసం నేషనల్ పేమెంట్స్‌ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ)ని పరిచయం చేసింది. మరియు ఇన్‌స్టంట్‌గా నగదును బదిలీ చేస్తున్నాము. రోడ్డు పక్కన వ్యాపారుల నుండి షాపింగ్‌మాల్ వరకు యూపీఐ ద్వారా పేమెంట్స్ జరుగుతున్నాయి. దీంతో ప్రజలు దీనికి అలవాటు పడ్డారు. కానీ అందుబాటులో ఉంచడంతో ప్రభుత్వం రోజువారీ బదిలీలపై పరిమితిని విధించింది.

యూపీఐ నగదు బదిలీ పరిమితి
ఎన్‌పీసీఐ మార్గదర్శాకాల ప్రకారం యూపీఐ ద్వారా ఒక వ్యక్తి గరిష్టంగా రూ.1లక్షవరకు చెల్లించవచ్చు. అయితే కొన్ని చిన్న బ్యాంకుల రూ. 25000మాత్రమే అనుమతిస్తున్నాయి. పెద్ద బ్యాంకులైతే రోజువారీ యూపీఐ రూ.1లక్షవరకు చెల్లించవచ్చు. అంటే బ్యాంకుకు బ్యాంకుకు పరిమితి మారుతూ ఉంటుంది.

రోజుకు యూపీఐ బదిలీ పరిమితి
యూపీఐ ఒక రోజులో నగదు బదిలీ పరిమితిని విధించింది. ఇది బదిలీల సంఖ్యకు పరిమితి ఉంది. రోజువారీ యూపీఐ బదిలీ పరిమితి 20 లావాదేవీలకు మించకూడదు. పరిమితి దాటిన తర్వాత పునరుద్దరించడానికి 24గంటలు వేచి ఉండాలి. కావున ముఖ్యమైన వాటి కోసం ముఖ్యంగా పెద్ద మొత్తంలో బదిలీలకు మాత్రమే ఉపయోగించుకోవాలిని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో బ్యాంక్ మార్గతర్శకాల ప్రకారం పరిమితి మారవచ్చు.

గూగుల్‌ పే
గూగుల్ పే అన్ని యూపీఐ యాప్‌లు మరియు బ్యాంక్‌ ఖాతాల్లో మొత్తం 10లావాదేవీ పరిమితులతో పాటు రోజుకు రూ.1లక్ష వరకు నగదు బదిలీలను అనుమతిస్తుంది. ముఖ్యంగా గూగుల్ పే లో ఎవరైనా రూ.2000 కంటే ఎక్కువ డబ్బు అభ్యర్థనలను పంపితే జీపే రోజువారీ లావాదేవీ పరిమితులను కూడా నిలిపివేస్తుంది. కావున అత్యవసరమైన వారి కోసం జీపే ను ఉపయోగించుకోవాలి.

ఫోన్‌పే
ఫోన్‌పే రోజువారీ యూపీఐ లావాదేవీ పరిమితిని రూ.1లక్ష సెట్‌ చేసింది. బ్యాంకుల పరిమితి బ్యాంకు బట్టి మారుతుంటుంది. దానితో పాటు ఒక వ్యక్తి బ్యాంక్ మార్గదర్శకాను బట్టి ఫోన్ పే యూపీఐ ద్వారా రోజుకు 10 నుండి 20లావాదేవీలను అనుమతిస్తుంది. జీపే మాదిరిగానే ఫోన్‌పే కూడా రూ.2000వరకు రోజు వారి అభ్యర్థనలను అనుమతిస్తుంది.

పేటీఎమ్‌
పేటీఎమ్‌ యూపీఐ వినియోగదారులకు రూ.1లక్షవరకు నగదు బదిలీని అనుమతిస్తుంది. అయితే యాప్ గంట మరియు రోజువారీ నగదు బదిలీలపై కూడా పరిమితులను సెట్‌ చేస్తుంది. పేటీఎమ్ రోజువారి నగదు బదిలీ పరిమితిరూ.1లక్ష. అలాగే గంటకు నగదు బదిలీ పరిమితి రూ.20000 వరకు ఉంటుంది. పేటీఎమ్‌ రోజువారి లావాదేవీల సంఖ్య 20గా నిర్దారించింది. అలాగే గంటకు లావాదేవీల సంఖ్యను 5గా నిర్దారించింది.

అమెజాన్ పే
అమెజాన్ పే ద్వారా యూపీఐ గరిష్ట నగదు బదిలీ పరిమితిని రూ.1లక్షగా నిర్ణయించింది. ముఖ్యంగా అమెజాన్ పే యూపీఐ కోసం నమోదు చేసుకున్న మొదటి 24గంటల్లో రూ.5000 వరకు మాత్రమే లావాదేవీలు చేయగలరు. బ్యాంకును బట్టి రోజుకు లావాదేవీల సంఖ్య 20కి సెట్ చేసుకోవచ్చు. మరీ ఇంకేందుకుఆలస్యం వెంటనే మీరు యూపీఐ యాప్ వాడుతున్నారో చూసుకోంది. తద్వారా పరిమితికి మించి లావాదేవీలను చేయవద్దు.

ఇవి కూడా చదవండి…

ఏపీ టాప్…ప్రజాప్రతినిధులపై సీబీఐ కేసులు

ఆప్.. జాతీయ పార్టీగా అవతరించబోతోందా ?

నాటి కలలు…నేడు నిజాలు:సీఎం

- Advertisement -