షూటింగ్ లకు మరోసారి బ్రేక్

239
shootings
- Advertisement -

లాక్ డౌన్ నేపథ్యంలో గత మూడు నెలలుగా సినిమా షూటింగ్ లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఇటివలే ప్రభుత్వం కొద్ది సడలింపులతో షూటింగ్ లకు అనుమతి ఇచ్చింది. కోవిడ్ నిమయనింబంధనలను పాటించి షూటింగ్ నిర్వహించాలని కోరింది. షూటింగ్ కు జరిగే ప్రాంతంలో శానిటైజేషన్ తో పాటు సామాజిక దూరం పాటించాలని కోరింది. కొన్ని షూటింగ్ లలో మాత్రం సామాజిక దూరం పాటించడం లేదని విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా తాజాగా ప్రముఖ సీరియల్ నటుడు ప్రభాకర్ కు నేడు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

దీంతో సిరియల్ షూటింగ్ ను నిలిపివేశారు. దాంతో ఆ సీరియల్ లో నటిస్తున్న నటీనటులందరికీ కరోనా టెస్టులు చేసారు. వారి రిపోర్టులు రావడానికి మరో రెండురోజుల సమయం పడుతుంది. దీంతో దాదాపు అన్న తెలుగు సీరియల్స్ షూటింగ్స్ ను నిలిపివేశారు. తెలంగాణలో కరోనా కేసులు ఎక్కువ వస్తుండటంతో మరికొద్ది రోజులు సిరీయల్స్ షూటింగ్ నిలిపివేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. లేదంటే మరికొంత మంది నటీనటులు కరోనా బారిన పడే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.

- Advertisement -