ఇటీవల దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రెజ్లర్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆయన కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా రెజ్లర్లు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. గత నెల రోజులుగా జరుగుతున్నా ఈ వ్యవహారం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. దేశ ఖ్యాతిని నలువైపులా విస్తరించే క్రీడాకారిణిలు లైంగిక వేధింపులకు పాల్పడడంతో మన దేశ గౌరవం మంటగలిసిపోయిందని అన్నీ వైపులా నుంచి న్యాయం కోసం మహిళా రెజ్లర్ల కు మద్దతు లభిస్తోంది.
ఇక ఇటీవల నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవ సందర్భంగా న్యాయం కోసం ఆందోళనలు చేపట్టిన మహిళా రెజ్లర్లపై పోలిసులు వ్యవహరించిన తీరు కూడా పెను సంచలనం అయిన సంగతి తెలిసిందే. అయితే ఇంత జరుగుతున్నా ప్రధాని మోడి మాత్రం ఈ విషయంలో అసలు స్పందించకపోవడంతో తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. కాగా అటు బ్రిజ్ భూషణ్ కూడా తనపై వస్తున్న ఆరోపణలను కొట్టి పారేస్తున్నారు. తాజాగా ఆయన స్పందిస్తూ ” తనపై వస్తున్న ఆరోపణలలో ఏ ఒక్కటి నిరూపించిన ఊరి వేసుకుంటానని.. ఆధారాలు ఉంటే కోర్టుకు సమర్పించండని ఎలాంటి శిక్షకైనా తాను సిద్దమే ” అని చెప్పుకొచ్చారు బ్రిజ్ భూషణ్. దీంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశం అవుతోంది.
Also Read: CM KCR:బ్రహ్మణులకు వరాల జల్లు
ఎందుకంటే బీజేపీపై బురద చల్లించేందుకే ఇలాంటి ఆరోపణలు పక్క పథకం ప్రకారం తెరపైకి తెస్తున్నారని అందుకే ప్రధాని కూడా ఈ విషయంలో అసలు స్పందించడం లేదని బీజేపీ సానుభూతి పరులు చెబుతున్నా మాట. అయితే దేశానికి వన్నె తెచ్చిన క్రీడాకారిణీలు మానాన్ని పణంగా పెట్టి రాజకీయం కోసం రోడ్డెక్కాల్సిన అవసరం ఏముంటుందని.. అందులో నిజం ఉండబట్టే మహిళా రెజ్లర్లు రోడ్డెక్కారనేది మెజారిటీ ప్రజలు, బీజేపీ వ్యతిరేక నేతలు చెబుతున్నా మాట. మరి ఇందులో నిజానిజాలు బయటకు రావాలంటే కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసి చర్యలు చేపట్టాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. మరి సంచలనంగా మారిన ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుదో చూడాలి.
Also Read: బీజేపీని కలవర పెడుతున్న ఆ ఇద్దరు !