బ్రహ్మోత్సవాలు..ప్రివిలేజ్ దర్శనాలు రద్దు

7
- Advertisement -

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం అయింది. ఇవాళ రాత్రి 7 గంటలకు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుండగా రేపు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు సీఎం చంద్రబాబు దంపతులు.

సామాన్య భక్తుల కోసం అన్ని ప్రివిలేజ్ దర్శనాల రద్దు చేశారు. భక్తులకు 16 రకాల ప్రత్యేక వంటకాల పంపిణీకి ఏర్పాట్లు చేయగా 4,700 మంది పోలీసులు, 3000 సీసీ కెమెరాలతో భారీ భద్రత నిర్వహించనున్నారు. భక్తులకు అందుబాటులో రోజూ 8 లక్షల లడ్డూలు ఉంచనున్నారు.

ఇక తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి చైన్నైకు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు సాధారణ రాళ్లు పొదిగిన రూ. ఒక కోటి విలువ చేసే తొమ్మిది బంగారు పతకాలను శ్రీవారి ఉత్సవ మూర్తులకు సోమవారం విరాళంగా అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అధికారులకు పతకాలను అందజేశారు.

Also Read:చిరు-పవన్‌పై ఆర్జీవీ పోస్ట్!

- Advertisement -