కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగియగా తాజాగా టీ కాంగ్రెస్ నేతలు సైతం పాదయాత్రకు రెడీ అవుతున్నారు. రేపటి నుండి 2 నెలల పాటు రాష్ట్రంలో హాథ్ సే హాథ్ జోడో యాత్ర చేపట్టనున్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సారథ్యంలో జరిగే ఈ యాత్ర ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మల సన్నిధానం నుంచి ప్రారంభం కానుంది. రేవంత్ సారథ్యంలో 50 నియోజక వర్గాల్లో యాత్ర జరిగేలా ప్లాన్ చేశారు.
ఈ నెల 24 నుంచి మూడు రోజుల పాటు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఏఐసీసీ ప్లీనరీ జరగనున్న నేపథ్యంలో యాత్రకు మూడు రోజుల విరామం ఇవ్వనున్నారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్, మధుయాష్కీ తదితర నాయకులంతా హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా రాష్ట్రం నలుమూలలా ప్రతి ఇంటికీ రాహుల్ సందేశాన్ని చేరవేయనున్నారు. ఇక రేపు పాదయాత్ర ప్రారంభంకానున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.
ఇవి కూడా చదవండి..