రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్..సర్వం సిద్ధం

22
ts
- Advertisement -

ఇవాళ రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్‌ జరుగనుంది. పోలింగ్‌కు రాష్ట్ర శాసనసభలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎలక్టోరల్‌ కాలేజ్‌ సభ్యులు ఓట్లేయనున్నారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రానికి చెందిన 119 మంది ఎమ్మెల్యేలతోపాటు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి కూడా ఇక్కడే ఓటేయనున్నారు.

ప్రాధాన్యతా పద్ధతిలో ఓటు వేయాల్సి ఉండగా ఇందుకోసం ఖచ్చితంగా ఎన్నికల సంఘం ఇచ్చిన పెన్‌ను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. వేరే పెన్ ఉపయోగిస్తే లెక్కింపు సమయంలో ఆ ఓటును పరిగణనలోకి తీసుకోరు. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ చీఫ్‌విప్‌, ప్రభుత్వ విప్‌లు సహ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

- Advertisement -