మణిరత్నం స్వీయ దర్శకత్వంలో చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, బాబీ సింహా వంటి స్టార్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం పొన్నియిన్ సెల్వన్. రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 30న విడుదల కానుంది.
తాజాగా మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన బిగ్ అప్‌డేట్‌ను ప్రకటించారు. త్వరలో ఈ చిత్ర ఫస్ట్‌సింగిల్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఏ.ఆర్ రెహమాన్, డ్రమ్మర్ శివమణితో కలిసి ఫస్ట్ సింగిల్‌ను రూపొందిస్తున్నట్లు వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించగా తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.