జమిలి, వక్ఫ్‌ బిల్లులు ఈ సమావేశాల్లోనే!

5
- Advertisement -

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నవంబరు 25 నుంచి డిసెంబరు 20 వరకు జరగనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు.ఈ సమావేశాల్లో భాగంగా రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా నవంబరు 26న రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు. సంవిధాన్‌ సదన్‌(పార్లమెంట్‌ పాత భవనం) సెంట్రల్‌ హాల్‌ ఇందుకు వేదిక కానుందని వెల్లడించారు. 18వ లోక్‌సభ ఏర్పడిన తర్వాత ఇవి మొదటి శీతాకాల సమావేశాలు. జూలై 22 నుంచి ఆగస్టు 9 వరకు మొదటి వర్షాకాల సమావేశాలు జరిగాయి.

ప్రస్తుతం.. మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. 20న పోలింగ్‌ జరగనుంది. నవంబరు 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

ఆ తర్వాతే పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే కేంద్రం ఒకే దేశం-ఒకే ఎన్నిక, వక్ఫ్‌ బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలిసింది. గత సమావేశాల్లోనే కేంద్రం వక్ఫ్‌ బిల్లును తీసుకువచ్చింది. అయితే.. భాగస్వామ్య పక్షాలు, విపక్ష పార్టీల డిమాండ్ల మేరకు సమగ్ర చర్చకుగాను బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి పంపేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. కాగా, ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్‌ పదవిని భర్తీ చేయాలని, దేశ వ్యాప్తంగా కుల గణన నిర్వహించాలని ఈ సమావేశాల్లో ప్రతిపక్షాలు డిమాండ్‌ చేసే అవకాశం ఉంది.

Also Read:Trump:అమెరికన్లకు స్వర్ణయుగమే

- Advertisement -