ఓజీ ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది!

21
- Advertisement -

సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఓజీ. ఇప్పటికే మెజార్టీ షూటింగ్‌ కంప్లీట్ కాగా తొలుత డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. జూలై నుండి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు పవన్. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా డివివి ఎంటర్‌టైన్మెంట్స్‌ నిర్మిస్తోంది.

పవన్ గ్యాంగ్ స్టర్‌గా నటిస్తుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా ఓజి సినిమా ట్యాగ్ సోషల్ మీడియాలో గత రెండు రోజుల నుంచి ట్రెండ్ అవుతుంది. ఇది మెయిన్ గా సినిమా మొదటి సాంగ్ కోసమే అని తెలుస్తోంది. ఆల్రెడీ థమన్ ఇచ్చిన హంగ్రీ చీతా బిట్ ట్యూన్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. దీనితో ఇప్పుడు అంతా ఫస్ట్ సింగిల్ కోసం ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.

Also Read:Pushpa 2:సెకండ్ సాంగ్ అదిరే న్యూస్!

- Advertisement -