నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి..

111
elections

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఇంకా ఒక్కరోజే మిగిలింది. ఈ క్రమంలో అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైంది. కరోనా నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మొత్తం 50 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, ఇందులో 14 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, వీడియో రికార్డింగ్ ఏర్పాటు చేశారు. ఓటింగ్‌లో 824 మంది పాల్గొననున్నారు. నిజామాబాద్ జిల్లాలో 483, కామారెడ్డి లో 341 మంది ఓటర్లు ఉన్నారు.

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నిక జరగనుంది. ఓటర్లలో 24 మంది కరోనా బాధితులు ఉన్నారు. వారికోసం పోస్టల్ బ్యాలెట్, నేరుగా ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే వారి కోసం లాస్ట్ అవర్‌లో అవకాశం కల్పిస్తారు. ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5 గం వరకు పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల్లో మొత్తం 399 మంది సిబ్బంది విధులు నిర్వత్తిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎన్నిక జరగనుంది.

ఇక ఆయా పార్టీల సంఖ్యాబలాన్నిబట్టి చూస్తే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత గెలుపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కాంగ్రెస్‌, బీజేపీలకు స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు పరిమితసంఖ్యలో ఉండడమే అందుకు కారణమని వారంటున్నారు. 12న వెలువడే ఉప ఎన్నిక ఫలితా ల్లో జాతీయ పార్టీలు మరోమారు గులాబీ పార్టీ చేతిలో పరరాజయాన్ని చవిచూసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.